వ్యవసాయం
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పంట
వరి.
రెండో ప్రధాన పంట జొన్నలు. ప్రాజెక్టులు, నదులు, కాలువలు ఉన్న ప్రాంతాలలో
వరి అధికంగా పండుతుంది. జొన్నల ఉత్పత్తిలో మహబూబ్‌నగర్, మెదక్, ఆదిలాబాదు
జిల్లాలు తొలి మూడు స్థానాలలో ఉన్నాయి. కందుల ఉత్పత్తికి మహబూబ్‌నగర్
జిల్లా కోడంగల్ నియోజకవర్గం మరియు రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గం
పేరుగాంచాయి. మొక్కజొన్న ప్రధానంగా మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్,
నిజామాబాదు, వరంగల్ జిల్లాలో పండుతుంది. పెసర్ల పంటలో మెదక్ జిల్లా
అగ్రస్థానంలో ఉంది. నూనెగింజల ఉత్పత్తిలో మహబూబ్‌నగర్ జిల్లా ప్రథమ
స్థానంలో ఉండగా నిజామాబాదు జిల్లా తర్వాతి స్థానంలో ఉంది. చెరుకు
ఉత్పత్తిలో మెదక్ జిల్లా తెలంగాణలో తొలి స్థానంలో ఉంది. మిరపపంటలో ఖమ్మం
జిల్లా అగ్రస్థానం పొందగా, పత్తి ఉత్పత్తిలో ఆదిలాబాదు జిల్లా ముందంజలో
ఉంది. పొగాకు, ఉల్లి సాగులో మహబుబ్‌నగర్ జిల్లా ప్రథమస్థానంలో ఉంది. మొత్తం
సాగుభూమి విస్తీర్ణంలో భౌగోళికంగా పెద్ద జిల్లా అయిన మహబూబ్‌నగర్
అగ్రస్థానంలో ఉండగా పూర్తిగా నగర ప్రాంతమైన హైదరాబాదు జిల్లాలో ఎలాంటి
సాగుభూమి లేదు.
No comments:
Post a Comment