మీర్ ఆలం ట్యాంక్ కి సమీపంలో ఉన్న ఈ నెహ్రూ జూలాజికల్ పార్క్ ప్రఖ్యాతి పొందిన పర్యాటక ఆకర్షణ కేంద్రం. నిజానికి, హైదరాబాద్ లో ఉన్న మూడు ప్రధాన ఆకర్షణ లలో ఒకటిగా ఈ పార్క్ స్థానం సంపాదించుకుంది. 1959 లో ఏర్పాటయిన ఈ పార్క్ ప్రజలకి 1963 లో అందుబాటులోకి వచ్చింది.
వివిధ రకాల జంతువులు, సరీసృపాలు మరియు పక్షులు ఈ జూ లో ఉన్నాయి. టైగర్, పాంథర్, ఏషియాటిక్ లయన్, పైథాన్, కొండచిలువ, ఒరాంగుటాన్, మొసలి, పక్షులు మరియు ఏంటేలోప్స్, జింకలు, ఇండియన్ రైనో వంటి సహజమైన జంతువుల జాతులని ఈ జూ లో గమనించవచ్చు. జంతువులు మరియు పక్షులకి సహజసిద్దమైన నివాసాలని ఏర్పాటు చెయ్యడంలోజాగ్రత్త వహించారు.
ఈ జూ సందర్శన వల్ల ఆహ్లాదంతో పాటు విజ్ఞానం కలుగుతుంది. పర్యాటకులు తమ పిల్లలతో ఈ జూ ని ఎక్కువగా సందర్శిస్తారు. ఏనుగు స్వారిలు, సఫారీలు ఈ జూ లో అందుబాటులో ఉంటాయి. ఈ జూ ప్రాంగణంలో నేచురల్ హిస్టరీ మ్యూజియం కూడా ఉంది.
No comments:
Post a Comment