Tuesday 13 October 2015

తెలంగాణ ప్రముఖులు

తెలంగాణ ప్రముఖులు

హైదరాబాదు సంఘసంస్కర్తగా పేరుపొందిన భాగ్యరెడ్డివర్మ, తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం రచించిన గోన బుద్దారెడ్డి,[34] సహజకవి బమ్మెరపోతన, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్, ప్రముఖ కవి, విమోచనోద్యమకారుడు దాశరథి రంగాచార్యులు, కవయిత్రి సరోజినీ నాయుడు, కవి పండితుడు వానమామలై వరదాచార్యులు, ఒగ్గు కథకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన మిద్దె రాములు, ప్రముఖ విమోచనోద్యమకారుడు, నిజాంపైబాంబులు విసిరిన నారాయణరావు పవార్, ప్రముఖ చిత్రకళాకారుడు కొండపల్లి శేషగిరి రావు, ప్రముఖ తెలంగాణవాది, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రముఖ సాహితీవేత్త జువ్వాడి గౌతంరావు, సుమతీ శతక కర్త బద్దెన, తొలి తెలుగు పురాణ అనువాదకుడు, మార్కండేయ పురాణం రచించిన మారన, భూమి కోసం, భుక్తి కోసం సాయుధపోరాటం చేసిన దొడ్డి కొమరయ్య, ప్రముఖ సాహితీవేత్త దేవులపల్లి రామానుజరావు, తెలంగాణ కాటన్‌గా ప్రసిద్ధి చెందిన నవాబ్ అలీ నవాబ్‌జంగ్ బహదూర్, ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహరావు, ప్రముఖ సంకీర్తనాచార్యుడు ముష్టిపల్లి వేంకటభూపాలుడు,[35] ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి సుబ్బారావు, నిజాం కాలంలో కొత్వాల్‌గా పనిచేసిన రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి,[36] సాయుధపోరాట యోధుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి, ప్రముఖకవి వేములవాడ భీమకవి, సమరయోధుడు రాధాకిషన్ మోదాని, జానపద సాహిత్య సృష్టికర్త బిరుదురాజు రామరాజు, తెలంగాణ సాహితీమూర్తి లక్ష్మీ నరసింహశర్మ, ప్రముఖ సమరయోధుడు పులిజాల వెంకటరంగారావు, 13వ శతాబ్దికి చెందిన శివకవి పాల్కురికి సోమనాథుడు, కమ్యూనిస్ట్ నాయకుడు బొమ్మగాని ధర్మభిక్షం, తెలంగాణ సాయుధ పోరాట సేనాని రాజ్ బహదూర్ గౌర్, నిజాంపై తిరగబడిన షోబుల్లాఖాన్, గద్వాల కోటను నిర్మించిన పెద సోమభూపాలుడు,[37] సమరయోధుడు జమలాపురం కేశవరావు, ప్రముఖ చిత్రకారుడు పాకాల తిరుమల రెడ్డి, ప్రముఖ కవి సామల సదాశివ, సాహితీ వేత్త కూరెళ్ల విఠలాచార్య, సమరయోధుడు, సంఘసంస్కర్త పల్లెర్ల హనుమంతరావు,[38] ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఒక రూపు తీసుకువచ్చిన కొత్తపల్లి జయశంకర్, అడవి బిడ్డలకు అండగానిలిచిన రాంజీ గోండు, కుతుబ్‌షాహీల నాటి కవి మరింగంటి సింగనాచార్యులు, తెలంగాణ ఉద్యమకారిణి టి.ఎస్.సదాలక్ష్మి, తొలితరం తెలుగు కవి కొరవి గోపరాజు, నటుడు కత్తి కాంతారావు, విమోచనోద్యమకారుడు విశ్వనాథ్ సూరి, దక్షిణ భారతదేశంలోనే తొలి మహిళాపాలకురాలు రుద్రమదేవి,
హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు
ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి అంజయ్య, సాహితీవేత్త కృష్ణస్వామి ముదియార్, తెలంగాణభాషలో కవితలద్దిన కాళోజీ నారాయణరావు, కవి మల్లినాథ సూరి, ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య, కవి, కళాకారుడు సుద్దాల హనుమంతు, బహుముఖ ప్రజ్ఞాశాలి వట్టికోట ఆళ్వారుస్వామి, తెలంగాణ రైతాంగపోరాటయోధుడు బందగి, ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు రావి నారాయణరెడ్డి, ముఖ్యమంత్రిగా, గవర్నరుగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు, సమరయోధుడు మందుముల నరసింగరావు, కళాకారుడు, కవి పల్లెర్ల రామ్మోహనరావు,[39] గవర్నరుగా పనిచేసిన బి.సత్యనారాయణ రెడ్డి, తెలంగాణలో కవులే లేరని హేళన చేయగా "గోల్కొండకవుల చరిత్ర"తో నోరుమూయించిన సురవరం ప్రతాపరెడ్డి, ప్రముఖ కవి మరియు చరిత్ర పరిశోధకుడు కపిలవాయి లింగమూర్తి, తొలితెలుగు కవయిత్రి కుప్పాంబిక, ప్రముఖ చరిత్ర పరిశోధకుడు, సాహితీవేత్త గడియారం రామకృష్ణ శర్మ, తెలంగాణ ఉద్యమనేత బొజ్జం నరసింహులు, నిజాం పాలనను ఎదిరించి ప్రజలలో చైతన్యం తెచ్చిన[40] అనభేరి ప్రభాకరరావు, 15వ శతాబ్దికి చెందిన ప్రముఖ కవి చరిగొండ ధర్మన్న, మొఘల్ పాలనను అడ్డుకున్న సర్వాయి పాపన్న, కూచిపూడి నృత్యంలో అంతర్జాతీయ ఖ్యాతిచెందిన రాజారాధారెడ్డి దంపతులు, ఆర్యసమాజ్ ప్రముఖుడు పండిత్ నరేంద్రజీ, విమోచనోద్యమకారుడు పాగ పుల్లారెడ్డి, నిజాంపై తిరగబడిన ఆదివాసి కొమురం భీమ్, ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు కె.చంద్రశేఖర రావు, ముఖ్యమంత్రిగా, గవర్నరుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి, కథా రచయిత అల్లం రాజయ్య, ప్రముఖ వాగ్గేయకారుడు రాకమచర్ల వేంకటదాసు, తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్న కోదండరాం, విమోచనొద్యమకారుడు వెల్దుర్తి మాణిక్యరావు, ప్రముఖ విద్యావేత్త జి.రాంరెడ్డి, ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠం, శాసనసభ స్పీకరుగా పనిచేసిన దుద్దిల్ల శ్రీపాద రావు, చేనేత వస్త్ర పరిశోధకుడు నల్ల పరంధాములు, ప్రముఖ సాహితీవేత్త, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణ రెడ్డి, కేంద్రమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నరుగా ఉన్న సి.హెచ్.విద్యాసాగర్ రావు, ప్రముఖ చరిత్ర పరిశొధకుడు ఆదిరాజు వీరభద్రరావు, విమోచనోద్యమకారిణి ఆరుట్ల కమలాదేవి, విప్లవకవి గద్దర్, ప్రముఖ రచయిత జ్వాలాముఖి, విమోచనొద్యమకారుడు మగ్దూం మొహియుద్దీన్, ప్రస్తుత కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ పితామహుడిగా పేరుపొందిన కొండా వెంకట రంగారెడ్డి, ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖులలో కొందరు.


No comments:

Post a Comment